Ticker

10/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

ELECTION 2024 - OPO DUTIES

 ELECTION 2024

ELECTION 2024 - OPO DUTIES

సాధారణ ఎన్నికలు-2024 - ఇతర పోలింగ్ సిబ్బంది (OPO) విధులు

 

ELECTION 2024 OPO DUTIES

సాధారణ ఎన్నికలు - 2024 లో భాగంగా మీరు ఇతర పోలింగ్ సిబ్బందిగా (OPO) నియమించబడ్డారు. నిష్పాక్షికంగా బాధ్యతాయుతంగా మీ విధులను మీరు నిర్వర్తించవలసి ఉంటుంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రిసైడింగ్ ఆఫీసర్ సూచనల మేరకు మీరు మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ పరిధిలో విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. పోలింగ్ స్టేషన్లో ప్రిసైడింగ్ అధికారి నిర్ణయం మేరకు మీరు ఏఏ పనులు చేయాలి అని నిర్దేశించడం జరుగుతుంది. తగిన జాగ్రత్తతో బాధ్యతతో ఎటువంటి పక్షపాతం లేకుండా ఖచ్చితంగా విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. ఇతర పోలింగ్ సిబ్బంది అవసరాన్ని బట్టి ముగ్గురు లేక నలుగురు లేక ఐదు మంది నియమించ బడతారు.


    మొదటి పోలింగ్ అధికారి (OPO-I)

    ఓటరు జాబితా మార్కుడు కాపీ వీరి వద్ద ఉంటుంది. వీరు ఓటరు తెచ్చిన ఓటరు స్లిప్పు మరియు గుర్తింపు కార్డు ఆధారంగా వచ్చిన ఓటర్ అసలు ఓటరా, కాదా అని సరిచూడాలి. వచ్చిన ఓటరు అసలు ఓటరు (సరైన ఓటరు) అని నిర్ధారించుకున్న తర్వాత అతని క్రమసంఖ్య, పేరు బిగ్గరగా చదవాలి. పోలింగ్ ఏజెంట్స్ నుంచి ఎటువంటి అభ్యంతరము లేకపోతే మార్కుడు కాపీలో మార్క్ చేయాలి.

    • Ø  ఓటర్ మగవారు అయితే పేరు ప్రక్కన (X) చేయాలి (ఓటరు యొక్క వివరాలు అన్నీ)
    • Ø  మహిళా ఓటరు అయితే (X) చేస్తూ క్రమసంఖ్య ని వృత్తము(రౌండప్) చేయాలి
    • Ø  ట్రాన్స్ జెండర్ ఓటరు అయితే (X) చేస్తూ క్రమసంఖ్య దగ్గర స్టార్ మార్క్ (*) ఉండాలి.
    • Ø  ప్రతి 2 గంటల తర్వాత PDMS యాప్ లో సమాచార నమోదు (data entry) కి కావలసిన సమాచారం ప్రిసైడింగ్ అధికారి (PO) కి అందించాలి.

    రెండవ పోలింగ్ అధికారి (OPO-2)

    • Ø  వీరు చెరగని సిరా (ఇండెలెబుల్ ఇంకు) మరియు 17 A రిజిస్టరుకు ఇంఛార్జీగా ఉంటారు.
    • Ø  ఓటరు ఎడమ చేతి చూపుడు వెలుపై సిరా రాసి 17 A రిజిస్టరులో ఓటరు యొక్క ఓటరులెస్టు క్రమ సంఖ్య, తెచ్చిన గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేసి అతనిచే సంతకము ! వేలిముద్ర తీసుకోవాలి.

    మూడవ పోలింగ్ అధికారి (OPO-3)

    • Ø  వీరు అసెంబ్లీ, పార్లమెంటు ఓటరు స్లిప్స్ కి ఇంచార్జ్.
    • Ø  వీరు అసెంబ్లీకి పింకు రంగు, పార్లమెంట్ కి తెలుపు రంగు ఓటరు స్లిప్పులు రెడీ చేసి ఓటర్ కి
    • Ø  ఓటర్ 20 2 6 ^ 4 I7A రిజిస్టరు, రన్నింగ్ సీరియల్ నెంబరు, ఓటరు జాబితా సీరియల్ నెంబరు రాసి సంతకము చేసి సంబంధిత ఓటరుకు అందించాలి.
    • Ø  ఓటర్ ఎడమ చేతి చూపుడు వ్రేలు పై సీరా గుర్తు ఉందా లేదా గమనించాలి.

     

    నాలుగవ పోలింగ్ అధికారి (OPO4)

    • Ø  వీరు పార్లమెంటు ఓటింగు కంపార్టుమెంటు దగ్గర ఉన్న కంట్రోలు యూనిట్ (CU) కు ఇన్ చార్జి. 
    • Ø  వీరు ఓటరు దగ్గర ఉన్న తెలుపు రంగు స్లిప్పు తీసుకొని కంట్రోలు యూనిట్ లో బ్యాలెట్ బటను నొక్కడం ద్వారా బ్యాలెట్ యూనిట్ యాక్టిప్ చేసి ఓటరును ఓటింగు కంపార్టుమెంటు లోకి పంపించాలి.
    • Ø  ఓటరు ఓటు వేసినప్పుడు వి.వి.పాట్ లో చూడమని చెప్పాలి.
    • Ø  తర్వాత అసెంబ్లీ ఓటింగు కంపార్ట్ మెంట్ దగ్గరికి వెళ్ళమని సూచన చేయాలి.

     

    ఐదవ పోలింగ్ అధికారి (OPO-5)

    • Ø  వీరు అసెంబ్లీ ఓటింగ్ కంపార్ట్మెంట్ వద్ద ఉన్న కంట్రోల్ యూనిట్ కి ఇంచార్జ్
    • Ø  వీరు ఓటర్ దగ్గర ఉన్న పింకు కలర్ ఓటర్ స్లిప్పు తీసుకొని కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ నొక్కడం ద్వారా బ్యాలెట్ యూనిట్ ని యాక్టివేట్ చేసి ఓటర్ కంపార్ట్మెంట్ లోకి వెళ్లి ఓటు వేయమని చెప్పాలి.
    • Ø  బ్యాలెట్ యూనిట్ లో బ్లూ బటన్ నొక్కిన తర్వాత వి.వి.పాట ని గమనించమని చెప్పాలి

     

    పై విధులే కాకుండా OPOలు నిర్వహించవలసిన మరికొన్ని విధులు:

    • Ø  మీరు నియమింప బడిన ఎన్నికల డిస్ట్రిబ్యుషన్ సెంటర్ నందు పోలింగ్ మెటీరియల్ కౌంటర్ నుంచి తీసుకొనుటకు, సరి చూచు కొనుటకు ప్రిసైడింగ్ అధికారి కి సహకరించాలి.
    • Ø  కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వి.వి.పాట్ గల బాక్సులు వాహనములోకి, వాహనము నుంచి పోలింగు స్టేషన్ లోనికి తీసుకెళ్లడానికి సహకరించాలి.
    • Ø  అన్ని ఫారములు మరియు కవర్లపై ఆడ్రసులు మరియు ఇతర వివరాలు రాయడంలో సహకరించాలి.
    • Ø  ఓటింగ్ కంపార్టుమెంటు ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ బయట పోస్టర్స్ ఏర్పాటు చేయడంలో సహకరించాలి.
    • Ø  మాక్ పోల్ సమయంలో ప్రిసైడింగ్ అధికారి లేదా సహాయ ప్రిసైడింగ్ అధికారికి ఓటింగ్ కంపార్ట్మెంట్ వద్ద సహకరించాలి
    • Ø  మాక్ పోల్ తర్వాత కంట్రోల్ యూనిట్, వి.వి.పాట్ సీల్ వేయునప్పుడు 2.2.5 స్లిప్పుపై సీలు వేసి నలుపు రంగు కవర్ లో ఉంచి సీలు చేయుటకు సహకరించాలి
    • Ø  ఎ.ఎస్.డి.(ASD) లిస్టు ఓటర్లు, నమూనా ఓటు (test vote) వేయునప్పుడు టెండరు బ్యాలెట్ (tender ballot) ద్వారా ఓటు వేయనప్పుడు సహకరించాలి.
    • Ø  పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వి.వి.పాట్ లు బాక్సులలో ఉంచి సీలు చేయునప్పుడు సహకరించాలి.
    • Ø  డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మరలా తిరిగి రిసెప్షన్ సెంటర్ కి వచ్చేవరకు మరియు పోలింగ్ మెటీరియల్ అంతా సెంటర్లో అప్పగించు వరకు అన్ని పనులలో ఇతర పోలింగ్ సిబ్బంది వారి యొక్క ప్రిసైడింగ్ అధికారి మరియు సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సహకరించవలెను.

    ఎన్నికల నిర్వహణ ఎంతో బాధ్యతా యుతమైనది. చిన్న పొరపాటు చేసినా, నిర్లక్ష్యము వహించినా అది తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుంది. కావున అప్రమత్తతతో విధులు నిర్వహించాలి.


    DOWNLOAD DOCUMENT

    Post a Comment

    0 Comments